A part of Indiaonline network empowering local businesses

ఆమె

Posted by : shivani on | Jun 20,2017

// ఆమె //

గాయాలతో రక్తమోడుతూ 
నవ్వులు నింపుతుంది 
నిశి లో జీవిస్తూ
వెలుగులు పంచుతుంది
నిలువెల్ల దహిస్తూ
తేనెల వానలు కురిపిస్తుంది
కల్మషాల కంటకాలు కన్నీటిని కురిపిస్తున్నా
దారంతా పువ్వులు పేర్చాలనుకుంటూ 
ఆగని జీవన స్రవంతిలా సాగిపోతుంది 
అవనిలో 
అడుగడుగున ఆమె ప్రతిరూపాలే.

_ సుకన్య

Comments